20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • 19.png

    Oct 17 ,2012 09:52 pm

    ganga_to_rambabu

    పవన్ కళ్యాణ్ నటించిన కొత్త సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ సినిమా రేపు (గురువారం) నాడు భారీ స్థాయిలో విడుదల అవుతుంది. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ తరువాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమా కోసం అంతా ఆసక్తి ఎదరుచూస్తున్నారు.
           మణిశర్మ స్వరపరిచిన ఈ సినిమా పాటలు ఆదరణ పొందటం ఈ సినిమాపై అంచనాలను ఇంకా పెంచుతుంది. అందాల భామ తమన్నా ఈ ‘రాంబాబు’కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. డివివిదానయ్య ఈ సినిమాను ఖర్చుకు వెనకాడ కుండా నిర్మించారు. కాగా, ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 1300కు పైగా ధియేటర్లలో విడుదల చేస్తున్నారు. నైజాం ప్రాంతంలోనే ఈ సినిమాను 260కు పైగా ధియేటర్లలో విడుదల చేస్తున్నారు.
           ఒక్క హైదరాబాద్ లోనే ఈ సినిమాను 100కు పైగా ధియేటర్లలో విడుదల చేస్తున్నారు. అలాగే, అమెరికాలో ఈ రాంబాబు 80కు పైగా స్ర్కీన్స్ లో విడుదల అవుతున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు, సినిమా వర్గాలు కూడా అసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాతో పవన్ మరో సారి బాక్సాఫీస్ ను షేక్ చెయ్యడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాగా ఈ మూవీ సాంగ్ మేకింగ్ వీడియోను పూరీ ఇవాళ విడుదల చేశారు. చూసి ఎంజాయ్ చేయండి మీరుకూడా..

     

    ...avnk

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers