
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా రూపొందబోతున్న విషయం బయటికి వచ్చినప్పటి నుండి అభిమానుల్లో ఎన్నో అంచానాలు మొదలయ్యాయి.. ఒక పవన్ అభిమానుల్లోనే కాకుండా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నే క్రేజ్ ఏర్పడింది. విడుదలకు ముందే బిజినెస్ లో ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు ’ సినిమా ఇప్పుడు మరో రికార్డు తన సొంత చేసుకోబోతుంది. ఈనెల 18వ తేదీన విడదుల కాబోతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇంత వరకు ఏ సినిమా విడుదల కానన్ని థియేటర్లలో విడుదల కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 905 స్ర్కీన్స్ లో , దేశ వ్యాప్తంగా 1100 థియేటర్లలో , ప్రపంచ వ్యాప్తంగా 1270 థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇక పవన్ అభిమానులు అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వసూళ్ల పరంగా కూడా రికార్డులు సృష్టించడం ఖాయమనే గట్టి నమ్మకంతో పవన్ అభిమానులు ఉన్నారు. మరి ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.
