ప్రముఖ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నయనతార గతంలో శింబుతో, ఆ తరువాత ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేయాణం నడిపి, ప్రభుదేవాను పెళ్లి చేసుకుందుకు కూడా సిద్ధపడింది. ఏమైందో ఏమోగానీ చివరి క్షణంలో వీరి ప్రేమ, పెళ్ళి పెటాకులు అయిన విషయం తెలిసిందే.. నయనతార శింబుతో విడిపోయిన తరువాత వీరిద్దరి మధ్య దూరం కూడా పెరిగింది. అప్పటి నుండి వీరిద్దరు అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. తాజాగా నయనతార తమిళ డైరెక్టర్ విష్ణు వర్థన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో అజిత్ తో జంటగా నయనతార నటిస్తుంది. మరో జంటగా ఆర్య -తాప్పీ నటిస్తున్నారు. ఈ రెండింటిని మించిన ఓ కీలకమైన పాత్ర ఉంది. దీనికి సదరు దర్శకుడు హీరో శింబుని పెట్టుకోవాలని భావించాడు. కానీ నయనతార శింబు మీద ఉన్న కోపంతో అతన్ని వద్దని, మన టాలీవుడ్ హీరో రాణాని రికమెండ్ చేసిందని కోలీవుడ్ వర్గాల సమాచారం.