
గతరాత్రి ‘డమరుకం' సినిమా ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ పాటల యొక్క ప్రత్యేకతను నాగ్ వెల్లడించారు. సందర్భానుసారంగా పాటలు వస్తాయనీ. ఆ పాటలు అన్ని వర్గాలవారిని అలరించడం వల్లనే ఆడియో సక్సెస్ అయిందని నాగ్ అన్నారు. రాత్రి హైదరాబాద్ - ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సినిమాలో మనసుకు ప్రశాంతతను ఇచ్చే శ్లోకం ... భక్తిని మేలుకొలిపే గీతాలు ... రొమాంటిక్ టచ్ ఇచ్చే 'నేస్తమా' ... మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే 'సక్కుబాయి' పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయనీ, అందుకే ఈ ఆడియో ఇంతటి విజయాన్ని సాధించిందని నాగార్జున చెప్పారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీనివాస రెడ్డి ... చార్మీ ... అచ్చిరెడ్డి ... రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. నాగార్జున - అనుష్క జంటగా తెరకెక్కిన ఈ సినిమా, ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలాఉండగా, 'డమరుకం' సినిమాను పరిశీలించిన సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ ను ఇచ్చారు. నాగార్జున కెరియర్లోనే తొలిసారిగా 40 కోట్ల ఖర్చుతో రూపొందిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. దైవ శక్తికీ ... దుష్ట శక్తికి మధ్య జరిగే పోరాటమే కథావస్తువుగా తెరకెక్కిన ఈ సినిమాకి, అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దాదాపు ఓ గంటపాటు తెరపై కనిపించే గ్రాఫిక్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.
కొద్దిసేపటి క్రితం ఆదిత్య మ్యూజిక్ విడుదల చేసిన ఈ సినిమా పుల్ సాంగ్స్ జ్యూక్ బాక్స్ మీకోసం.. చూసి ఎంజాయ్ చేయండి...
...avnk