
అభినయంలో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ. ఈమె తాజా సినిమా అయ్యా..! ఇవాళే (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం తరువాత తాను నటిస్తున్న ఈ అయ్యా సినిమాపై రాణీ ముఖర్జీ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రంతో తన సత్తా నిరూపించుకుని ఇప్పుడు వస్తున్న లేత భామలకు తానేం తీసిపోనని నిరూపించుకోవాలనుకుంటుంది. అందుకోసం, తాను తప్ప వేరే ఆకర్షణ లేని ఈ సినిమా కోసం రాణీ చాలా కష్టపడింది. ఈ సినిమాలో మూడు ఐటెం సాంగ్ లలో నటించింది. ఈ సినిమాకు ఈ మూడు పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ అంటోంది.
నేడు బాలీవుడ్ లో మరో సినిమా విడుదల అవుతుంది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి అద్బుత సృష్టి ఈగ హిందీలో విడుదల అవుతుంది. మక్కీ పేరుతో విడుదల అవుతున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
...avnk