
వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో పోసాని కృష్ణ మురళి పెట్టిందిపేరు. ఇక ఈతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ విచిత్రంగా వుంటాయి. అందుకే, ఆయనను వినూత్నమైన పాత్రల్లో చూపించడానికి దర్శకులు ఉత్సాహం చూపిస్తుంటారు. ఆమధ్య 'వేదం' సినిమాలో పోసానిని పోలీస్ ఇన్స్ పెక్టర్ పాత్రలో ప్రెజెంట్ చేసిన దర్శకుడు క్రిష్, తాజాగా 'కృష్ణం వందే జగద్గురుం' సినిమాలో మరో వెరైటీ పాత్రలో చూపిస్తున్నారు. ఇందులో ఈయన పాత్ర పేరు 'టిప్పు సుల్తాన్'. అయితే, అప్పటి రాజైన టిప్పు సుల్తాన్ కీ, దీనికీ ఏమాత్రం సంబంధం వుండదు. ఈ పాత్రలో పోసాని తరహా నటన ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుందట. పైగా, ఇది నిడివి పరంగా కూడా పెద్ద క్యారెక్టర్ అని అంటున్నారు. వచ్చే నెలలో విడుదలకు ఈ చిత్రం సిద్ధం అవుతోంది. రానా, నయనతార ఇందులో జంటగా నటిస్తున్నారు.
...avnk