
కొందరు హీరోయిన్లు వయస్సు అయిపోయినా ఇంకా కుర్రకారును మత్తెక్కిస్తుంటారు. మరికొందరు వయస్సులో ఉండికూడా అంతగా ఆకట్టుకోరు. మరి కొందరు అయితే తమ అంద చందాలతో కుర్రకారు నుండి ముసలి వాళ్ళ వరకు అందర్నీ టెంప్ట్ చేస్తారు. అలాంటి జాబితాలోకే వస్తుంది నయనతారు. వెండితెరకు బైబై చెబుతానిని ప్రకటించి, ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నయన్ కి టాలీవుడ్ లో అవకాశాలు బాగానే వస్తున్నారు. తాజా ఈమె దగ్గుబాటి రాణా సరసన ఓ సినిమా, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సరసన ఓ సినిమాలో నటిస్తుంది.
క్రిష్ దర్శకత్వంలో రాణా - నయనతార జంటగా నటించిన ‘క్రిష్టం వందే జగద్గురుమ్ ’ ఆడియో ఇటీవలే విడుదల అయింది. ఈ ఆడియో కార్యక్రమానికి హాజరయిన నయనతార మెరుపుతీగలా... సన్నజాజి ఒంపుసొంపులతో అక్కడున్నవారిని తెగ టెంప్ట్ చేసిందట. నయనతార అందాలకు ఫిదా అయిన మూవీ మొగల్ రామానాయుడు నయనతారను డైరెక్టుగా అడిగేశాడట. మా అబ్బాయి వెంకీతో చేశావు... మనవడు రానాతోనూ చేశావు.. మరి నాతో ఎప్పుడు చేస్తావూ.. అని అడిగారట నాయుడుగారు. దీనికి నయనతార తన నవ్వుతో సమాధానం చెప్పిందట. నయనతార 60 ఏళ్ళ రామానాయుడినే తన అందానికి దాసోహం అయ్యేలా చేసుకుందంటే... ఈమెలో ఇంకా విషయం ఉందని అందుకే రామానాయుడు టెంప్ట్ అయ్యాడని సినీ జనాలు అనుకుంటున్నారు.
