25 May Saturday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
  • 5.png

    Oct 09 ,2012 03:26 pm

    renigunta-vv-vinayak_inn

    మూస చిత్రాలకు తిలోదకాలిస్తూ,  యాక్షన్ చిత్రాలను కొత్తపుంతలు తొక్కించిన దర్శకుడు వి.వి. వినాయక్. అందుకే మాస్ ఇమేజ్ కోరుకునే హీరోలందరూ ఆయనతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతుంటారు. మాస్ అంశాలను మేళవించిన కథాంశాలను ఎంచుకోవడం, దానికి ఇటు వినోదాన్ని .... అటు సెంటిమెంటును, కడుపుబ్బానవ్వించే కామెడీని కలగలిపి ప్రేక్షకులు కోరుకుంటోన్నవిధంగా అందించడం ఆయన ప్రత్యేకత. అయితే ‘ఆది’ ‘లక్ష్మీ’ ‘చెన్నకేశవరెడ్డి’, బద్రీనాథ్ వంటి యాక్షన్ చిత్రాలనే కాదు, 'దిల్' 'బన్ని' వంటి రొమాంటిక్ లవ్ స్టోరీస్ ను సైతం సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించిన ఘనత ఆయన గ్రాఫ్ లో కనిపిస్తోంది. ఇక నితిన్ వంటి చిన్న హీరోతోనే కాదు ... చిరంజీవి వంటి అగ్ర కథానాయకుడితో 'ఠాగూర్' వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించి సంచలన విజయాన్ని అందుకున్న రికార్డ్ ఆయన సొంతం.  'కృష్ణ ', 'అదుర్స్' వంటి చిత్రాలు సాధించిన విజయాలు చూస్తే, ఆయన యాక్షన్ నీ ... కామెడీని ఎంత అద్భుతంగా కలిపి వండగలడనేది అర్ధమౌతుంది. ఇక చిరంజీవికి  'ఠాగూర్' వంటి మరువలేని విజయాన్ని ఇచ్చిన వినాయక్, ఆయన తనయుడు రామ్ చరణ్ తో 'నాయక్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా హిట్ కొడితే ఆయన ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరడం ఖాయమనే అభిప్రాయాలు అంతటా వినిపిస్తున్నాయి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటోన్న వివి వినాయక్ కు తెలుగువిశేష్.కాం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

    ...avnk

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers