
యంగ్ హీరో నాగ చైతన్య - సమంతా జంటగా దేవా కట్టా తెరకెక్కిస్తోన్న 'ఆటోనగర్ సూర్య' చిత్రం విడుదల వాయిదా పడింది. ముందుగా ఈ సినిమాను నవంబరు 9 న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడీ విడుదల తేదీ డిసెంబరు 2 కి మారింది. తాను దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్ 2 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా దేవా కట్టా తెలియజేశారు. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుందనీ, మరో రెండు పాటలను మాత్రమే చిత్రీకరించవలసి ఉందని అన్నారు. ఆడియో విడుదలకి ముందు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని చెప్పారు. చిత్రీకరణలోనే తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటున్న ఈమూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
...avnk