
పవర్ స్టార్ ఓ పని కోసం కమీట్ అయ్యాడంటే ఎంత కష్టమైనా సరే ఆ పని పూర్తి చేసే వరకు నిష్ర్కమించడు. ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది నిన్న రాత్రి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘గంగతో రాంబాబు ’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాని ఈ నెల 18 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం శబ్దాలయ స్టూడియోలో ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.
ఇప్పటికే తమన్నా డబ్బింగ్ పూర్తియింది. మిగిలింది పవన్ కళ్యాణ్ డబ్బింగే. దీని కోసం పవన్ కళ్యాణ్ నిన్నటి నుండి కష్టపడుతున్నాడు. సాయంత్రానికి ఆ పని పూర్తి కాకపోవడంతో నిన్న రాంత్రంతా అక్కడే ఉండి,
మధ్యలో కొంత సేపు మాత్రమే గ్యాప్ తీసుకుని డబ్బింగ్ వర్క్ మొత్తం పూర్తి చేసాడని, డబ్బింగ్ అయిన తరువాతనే అక్కడి నుండి వెళ్ళిపోయాడని ఆ యూనిట్ సభ్యులు అంటున్నారు. దీంతో ఈ సినిమాకి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ పూర్తయినట్లే . ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది.