
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల తన భార్య స్నేహా రెడ్డి బర్తేడే సందర్బంగా ఏర్పాటు చేసిన పార్టీ కాస్త అనుకోని కారణాలతో ఫెయిల్యూర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ఓ వార్తా పత్రిక కథనం ప్రకారం శనివారం రాత్రి(సెప్టెంబర్ 30)న స్నేహా రెడ్డి బర్త్ డే సందర్భంగా బన్నీ తన కొత్త గెస్ట్ హౌస్‌లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసాడు. ఈ వేడుకకు దాదాపు 80 మంది అతిథులు హాజరయ్యారని, రామ్ చరణ్-ఉపాసనతో పాటు బన్నీకి అత్యంత సన్నిహితులు హాజరైనట్లు తెలుస్తోంది. ఎకరం విస్తీర్ణంలో దాదాపు 7000 చదరపు అడుగుల మేర బన్నీ కొత్త గెస్ట్ హౌజ్ విస్తరించి ఉంది. గెస్ట్ హౌజ్ చుట్టు ఉన్న గార్డెన్ లో పార్టీ జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసారు.
ధనవంతుల పార్టీలో ఉండే అన్ని ఐటమ్స్ రెడీ అయ్యాయి. అయితే ఆ రోజు రాత్రి భారీ వర్షం కురవడంతో అంతా అప్ సెట్ అయ్యారని, ఎన్నో అంచనాలతో ఏర్పాటు చేసుకున్న పార్టీ సక్సెస్ కాక పోవడంతో బన్నీ మూడ్ మారిపోయిందని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ కూడా మూడ్ అవుట్ అయ్యారని సినీ వర్గాల సమాచారం. ఈ పార్టీ అలా అవ్వడంతో స్నేహా రెడ్డి కూడా మూడ్ అవుట్ అయ్యిందని అంటున్నారు.
