
పూరీ జగన్నాథ్ ఫాస్ట్ ఫాస్ట్ గా సినిమాలు తీయడమే కాకుండా కొత్త కొత్త ఐటెం పాపలను ఇండస్ట్రీకి పరిచం చేస్తుంటాడు. గతంలో ముమైత్ ఖాన్ ని తెరపైకి తెచ్చి, రెండు మూడు సార్లు వాడుకొని ఇప్పుడు ప్రక్కన పెట్టేశాడు. ఇక ఆమె తరువాత మరో కొత్త పాపను ఐటెం గర్ల్ గా వాడుకుంటున్నాడు. ప్రస్తుతం తాను పవన్ కళ్యాణ్ తో చేస్తున్న చిత్రంలో బ్రిటీష్ మోడల్ తో ఓ మాంటి మసాలా ఐటెం సాంగ్ చేయించాడు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు మార్కెట్లో ఇప్పటికే ఓ క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ఐటెం సాంగ్ చేసిన ‘స్కార్లెట్ విల్సన్ ’ కి ఆకర్షితుడైన పూరీ లేటెస్ట్ వర్షన్ ‘ఐఫోన్’ను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు సమాచారం. గతంలో కూడా ఎంతో మంది కళాకారులకు గిప్టులు ఇచ్చి సర్‌ప్రైజ్ కలిగించాడు పూరీ.
