
సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడిస్తాడో గానీ, ప్రస్తుతానికి కోలీవుడ్ వుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యాడు. పూరీజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘బిజినెస్ మెన్ ’ చిత్రాన్ని తమిళంలో డబ్ చేయబోతున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటే తమిళంలో విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వరకు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి కాగానే విడుదల ఎప్పుడనేది చెబుతామని సదరు నిర్మాతలు అంటున్నారు.
ఈ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్ లో తన ఎండా ఎగురవేయడం ఖాయం అని, ఇందుకోసం మహేష్ బాబు కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో చేసిన నటులకు తమిళంలో మంచి గుర్తింపు ఉంది. వారందరికి తోడుగా మహేష్ జత కవడంతో... ఈ సినిమా ఓపెనింగ్ భారీ స్థాయిలో ఉంటాయని నిర్మాతలు అంటున్నారు. మరి మహేష్ అక్కడ ఏరేంజ్ లో ‘బిజినెస్ చేస్తాడో ’చూడాలి.
