తెదేపా పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు కింజారపు ఎర్రన్నాయుడు మృతి మన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్బాంత్రిని వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా, ఎమ్మెల్యేగా తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్న ఎర్రన్నాయుడు చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ... మన రాష్ట్రం ఓ మంచి నాయకుడ్ని కోల్పోయిందని ఆయన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియ జేశారు.