
ఆంధ్రప్రదేశ్ కి మరో బంపర్ అవకాశం వచ్చింది. మొన్న జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో మన రాష్ట్రానికి చెందిన పురంధరీశ్వరికీ వచ్చే ప్రమోషన్ చివరి నిమిషంలో ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వాణిజ్య సహాయ మంత్రిగా ఉన్న ఆమెకు ప్రమోషన్ ఇస్తూ స్వతంత్ర హోదాలో జౌళిశాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో మన రాష్ట్రానికి రెండు స్వతంత్ర హోదాలో పదవులు దక్కినట్లయింది. కేంద్రమంత్రిగా దయానిధి మారన్ రాజీనామా చేసిన తరువాత ఆ శాఖకు మన రాష్ట్రానికి చెందిన పనబాక లక్ష్మి సహాయ మంత్రిగా చేశారు. ఇప్పుడు ఆమెకు పెట్రోలియం శాఖ మంత్రిగా మార్చారు. పురంధరీశ్వరికి స్వతంత్ర హోదాలో మంత్రి పదవి ఇవ్వడంతో మన రాష్ట్రానికి మరో ప్రాధాన్యం ఉన్న శాఖ దక్కినట్లు మనం భావించ వచ్చు.
