
మోహన్‌బాబు కుటుంబంపై బ్రాహ్మణ సంఘాలు హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేశాయియి. శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్లిన తమపై మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణులు గూండాలతో దాడి చేయించారని బ్రాహ్మణులు ఆరోపించారు. బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్న సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని బ్రాహ్మణ సంఘాలు హెచ్‌ఆర్‌సీని కోరాయి. తమపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశాయి. దాడికి సంబంధించిన వీడియో దృశ్యాలను హెచ్‌ఆర్‌సీకి వారు సమర్పించారు. దేనికైనారెడీ సినిమా హీరో మంచు విష్ణు కారుపై బ్రాహ్మణులు చెప్పులు విసిరి నిరసన తెలిపారు. హెచ్‌ఆర్‌సీలో పరస్పర ఫిర్యాదు చేసుకున్న మంచు విష్ణు, బ్రాహ్మణులు అక్కడే గొడవకు దిగారు. విష్ణుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.