ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతర దినోత్సవ వేడుకులు ఘనంగా జరుగుతున్నాయి. అయితే తెలంగాణ వాదులు మాత్రం విద్రోహ దినంగా నిరసన తెలిపి, ఈ వేడులకు అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే జేఏసీ ఛైర్మెన్ కోదండ్ రామ్ ని పోలీసులు ముందుగానే హౌజ్ అరెస్ట్ చేశారు. ఆయన ఇవాళ్టి దినాన్ని తెలంగాణ విద్రోహ దినంగా పాటించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈయనను హౌజ్ అరెస్ట్ చేయడంతో ఆయన బయటికి వచ్చి నిరసన తెలిపే అవకాశం లేకుండా పోయింది. ఈయనను హౌజ్ అరెస్ట్ చేయడాన్ని నాగం జనార్థన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
