
అమెరికాను చిగురుటాకులా వణికుస్తున్న శాండీ తుఫాన్ లో మన తెలుగు హీరోయిన్ అయిన ఆర్తీ అగర్వాల్ చిక్కుకుంది . ఒకప్పుడు తెలుగు తెరను తన అంద చందాలతో ఏలిన ఈ భామ అగ్ర హీరోల అందరి సరసన నటించి అగ్ర పథం పయనించింది. కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలో ప్రేమా, దోమా, ఆత్మహత్యా యత్నాలు చేసిన ఆర్తీ అగర్వాల్ తరువాత తెర మరుగు అయింది. దీంతో ఏంచేయాలో పాలుపోక ఓ ఎన్నారైని పెళ్ళి చేసుకొని అమెరికా వెళ్ళి సంసారం చేయడం ఇష్టం లేక భర్తకు విడాకులకు ఇచ్చి, తిరిగి ఇండియాకి వచ్చి అడపాదడపా అవకాశాలు సంపాదించుకున్నా ఆమె చూసే తెలుగు వారే కరువయ్యారు. అలాంటి ఆర్తీ అగర్వాల్ అమెకారలో శాండీ తుఫాన్ లో చిక్కుకుంది. ఈమె బస చేస్తున్న హోటల్ నుండి పోలీసులు ఆమెను ఓ ఆశ్రమానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అరకొర అభిమానులు అయ్యే పాపం అని అనుకుంటున్నారు.. మరి ఆర్తీ అమెరికాకి ఏ పనిమీద వెళ్ళినట్లో.