డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మంచి విష్ణు నటించిన ‘దేనికైనా రెడీ ’ చిత్రం వివాదాలు రేపుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విషయంలో మోహన్ బాబుకి, బ్రాహ్మణ సంఘాలకి మధ్య యుధ్ధం కూడా నడుస్తుంది. ఈ చిత్రంలో కొన్ని బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని వారు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. వారి ఆందోళన పై మోహన్ బాబు వాళ్లు నిజమైన బ్రాహ్మణులు కాదని, చందాలు అడుక్కోవడానికి వచ్చి ఉంటారని, వేదం చదివే బ్రాహ్మణ పండితులు ఇలా చేయరని, ఆందోళన పేరుతో వాళ్లు చందాలు అడుక్కోవడానికి వచ్చారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో మరింత ఆజ్యం పోసినట్లయింది. దీంతో ఆగ్రహించిన బ్రాహ్మణులు మోహన్ బాబుకు పిండం పెట్టి తమ నిరసన తెలిపారు. చందాలు వసూలు చేసి ఆ చెక్కులను మోహన్ బాబుకు పంపారు. మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని లేకుండా ఆందోళన కార్యక్రమాలు మరింత తీవ్రతరం చేస్తామని, లీగల్ గా అప్రోచ్ అవుతామని హెచ్చరించారు. మరి దీని పై మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.