ప్రముఖ దేవస్ఠానం అయిన షర్డీలో సెల్ ఫోన్ వినియోగాన్ని నిషేధించారు. అక్కడి షిర్డీ సాయిబాబా సంస్థాన్ అక్కడ పనిచేసే ఉద్యోగులు సెల్ ఫోన్లు వినియోగించరాదని ఆంక్షలు విధించింది. కొందరు ఉద్యోగులకు బయటి వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయని.. సొమ్ములు పుచ్చుకుని సంపన్నులకు వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని షిర్డీ సంస్థాన్ ఈవో కిషోర్ తెలిపారు. మరి దీన్ని ఎంత వరకు అమలు చేస్తారో చూడాలి.