కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో చికెన్ తినకూడదట. ఇదేదో అక్కడి ప్రభుత్వమో లేక బెంగుళూరు మున్సిపాలిటీ అధికారులు విధించిన నిబంధన కాదండీ... విషయం ఏంటంటే.... బెంగళూరులో బర్డ్‌ఫ్లూ విజృంభిస్తోంది. నగర వాసులను ఇది తీవ్రఆందోళనకు గురి చేస్తోంది. గత 20 రోజులుగా నగర శివారులోని హెసరఘట్టలో ఉన్న జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థలో వేలాది కోళ్లు చనిపోతున్నాయి. దీంతో సంస్థకు పది కిలోమీటర్ల చుట్టుపక్కల కోడిగుడ్లు, కోడిమాంసం విక్రయాలపై అధికారులు నిషేధం విధించారు. అదీ విషయం.