
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉండటంతో మచిలీపట్నం, క్రిష్ణపట్నం, వాడరేవు, నిజాంపట్నం ఓడరేవుల్లో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఎలాంటి ఫరిస్థితినైనా ఎదుర్కొనేందుకు , నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు ముందుగా తీరప్రాంత మండలాల్లోని అధికారులను అందుబాటులో ఉండాల్సిందిగా క్రిష్ణా జిల్లా కలెక్టర్ బుద్దప్రకాష్ ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత మండలాల్లోని అధికారులకు సెలవులు రద్దుచేశారు.