
అమెరికాలో పెన్సిల్వేనియాలో చిన్నారి శాన్విని దారుణంగా హత్య చేసిన రఘునందన్ ని శిక్షించాలని, నా కొడుకు శిక్షార్హుడే అని రఘునందన్ తల్లి మీడియాకు చెప్పింది. ఈ హత్యకు సంబంధించిన కారణాలను వెలికి తీయాలని అతని తల్లి విజ్ఞప్తి చేసింది. ఈమె మీడియాతో మాట్లాడుతూ.... నా కొడుకు వారి కుటుంబానికి చేయరాని అన్యాయం చేశాడని, అతడికి శిక్షవేయడమే సరైన న్యాయం అని, నా కొడుకు చేసిన తప్పు క్షమించరానిదని, శాన్వి కుటుంబ సభ్యులను క్షమించమని కోరింది. రఘునందన్‌ది మొదటి నుండి నేరపూరిత స్వభావం కాదని, నలుగురికి సహాయం చేసే గుణం అని చెప్పారు. ఎవరికీ ప్రాణహానీ చేసే వాడు కాదన్నారు. అయితే తప్పు చేశాడు కాబట్టి శిక్షించాల్సిందేనని, ఆ శిక్షను మన భారత దేశంలోనే వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే తన కోడలు కూడా ఈ హత్యకు సహకరించిందంటే నేను నమ్మలేకపోతున్నానని అన్నారు.