తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీకోసం ’ యాత్రలో భాగంగా మహబూబ్ నగర్ లోని గద్వాలలో జరిగిన మీటింగ్ లో వేదిక కూలడంతో గాయపడిన విషయం తెలిసిందే. అయితే బాబును పరామర్శించేందుకు పలువురు నాయకులు పరామర్శించారు. బాబును పరామర్శించిన వారిలో కుటుంబ సభ్యులు, సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. పరామర్శించిన వారిలో నారా రామ్మూర్తి నాయుడు తనయుడు, ప్రముఖ హీరో నారా రోహిత్ కూడా ఉన్నారు. ఈయన పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ.... తన పెదనాన్నకు ఎంతో ఆత్మ విశ్వాసం ఉంటుందని, ఆ కారణంగానే ఇంత భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయి.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు.