డిఎండికె వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ శనివారం మీడియాపై నిప్పులు చెరిగారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి చెన్నై విమానాశ్రయంలోకి మధురై వెళ్లేందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో విలేకరులు ఆయనను పార్టీ మారుతున్న సొంత ఎమ్మెల్యేల గురించి ప్రశ్నించారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు అతను తన సహనాన్ని కోల్పోయి వారిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ‘‘ఒరేయ్ కుక్క... నువ్వడిగిన దానికి సమాధానం చెప్పడానికి మీ పత్రికేమైనా నాకు జీతమిస్తోందా ? అంటూ ఓ విలేఖరిని తనకు ఇష్టం వచ్చినట్లు తిట్టారు. అయితే విజయ్ కాంత్ పై డీఎంకె ఎమ్మెల్యేలు సీఎం జయలలితకు ఫిర్యాదు చేశారు. ఇదే బాటలో శనివారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో ఎయిర్ పోర్ట్ లో కలిసిన విజయ్ కాంత్ పై మీడియా వివరణ కోరడంతో ఈ విధంగా ఫైర్ అయ్యారు. ఒక రాజకీయ నాయకుడై ఉండి మీడియా పై ఇలా దుసురుగా ప్రవర్తించడం సరికాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.