మన రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివ రావు తన పదవికి రాజీనామా చేశాడు. కేంద్ర కేబినెట్ విస్తరణ సమయంలో ఆయన రాజీనామా చేయడం సంచలనం రేపుతుంది. రేపు కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని కావూరి సాంబశివ రావు ఆశించాడు. కానీ ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యినట్లు సమాచారం. లోక్సభ స్పీకర్ మీరాకుమార్కు, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖలు పంపారు. ఈయనతో పాటు మరో ఎంపీ అయిన రాయపాటి సాంబశివరావు కూడా తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు. రాయపాటి సాంబశివరావు గత కొన్నేళ్ళ నుండి టీటీడీ ఛైర్మెన్ పదవి కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆయనకు ఇంత వరకు ఆ పదవి ని కట్టబెట్టలేదు. ఇప్పుడు మంత్రి వర్గంలో కూడా చోటు కల్పించలేక పోవడంతో ఈయన కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. మొత్తానికి మన రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో మళ్ళీ మంటలు అంటుకున్నాయని చెప్పవచ్చు.
