ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ విస్తరించడానికి ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇద్దరు కేంద్ర మంత్రులు అయిన కేంద్ర మంత్రుల ముకుల్ వాస్నిక్ , అంబికాసోనీలు తమ పదవులకు రాజీనామా చేశారు. రేపు కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఉండడంతో వాస్నిక్, సోనీల రాజీనామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముకుల్, సోనీలను పార్టీ పనుల కోసం వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్టు సమాచారం. వీరి స్థానంలో కొత్త అవవారికి అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.