పండుగలు తదితర కారణాల రిత్యా రైళ్లలో ప్రయాణీకుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకొని 38 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
సికింద్రాబాద్-తిరుపతి వయా ధర్మవరం: 02732 నంబర్ ప్రత్యేక రైలు నవంబర్ 1న రాత్రి 8.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. తిరిగి నవంబర్ 4న సాయంత్రం 4.40 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది.
కరీంనగర్-తిరుపతి: 02762 నంబర్ ప్రత్యేక రైలు నవంబర్ 2న సాయంత్రం 6.50 గంటలకు కరీంనగర్‌లో బయలుదేరుతుంది. తిరిగి నవంబర్ 3న సాయంత్రం 4.45కు తిరుపతి నుంచి బయలుదేరుతుంది.
విశాఖపట్నం-సికింద్రాబాద్ వయా కాజీపేట: 08513 నంబర్ రైలు అక్టోబర్ 26న విశాఖపట్నంలో రాత్రి 7.05 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి అక్టోబర్ 27న సికిం ద్రాబాద్ నుంచి రాత్రి 8.00 గంటలకు బయలుదేరుతుంది.
విశాఖపట్నం-సికింద్రాబాద్ వయా గుంటూరు: 08511 నంబర్ ప్రత్యేక రైలు అక్టోబర్ 28, నవంబర్ 4, 11 తేదీల్లో రాత్రి 7.05 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి సికింద్రాబాద్ నుంచి అక్టోబర్ 29, నవంబర్ 5, 12 తేదీల్లో రాత్రి 7.45 గంటలకు రైలు ప్రారంభమవుతుంది.
విశాఖపట్నం-షిర్డీసాయి నగర్: 02801 నంబర్ ప్రత్యేక రైలు నవంబర్ 1, 8 తేదీల్లో విశాఖపట్నం నుంచి ఉదయం 9.10 గంటలకు బయలుదేరును. తిరిగి షిర్డీసాయి నగర్ నుంచి నవంబర్ 2, 9 తేదీల్లో రాత్రి 7.10 గంటలకు రైలు ప్రారంభమవుతుంది.
విశాఖపట్నం-చెన్నై: 02869 నంబర్ రైలు నవంబర్ 5, 12వ తేదీల్లో విశాఖలో రాత్రి 7.20 గంటలకు మొదలవుతుంది. తిరిగి నవంబర్ 6, 13న చెన్నై సెంట్రల్ నుంచి రాత్రి 9.10 గంటలకు బయలుదేరుతుంది.
...avnk