
రాష్ట్ర కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహానికి తెరలేచింది. రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి కేంద్ర క్యాబినెట్ లో బెర్త్ ఖాయమైంది. తెలుగువిశేష్.కాం కు అందిన కీలక సమాచారం ప్రకారం చిరు ఈనెల 28న యూనియన్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఫలితంగా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేసే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర కేబినెట్ ను వచ్చే ఆదివారం విస్తరిస్తారని ఈ ఉదయం నుంచీ ఢిల్లీలో జోరుగా ఊహాగానాలు సాగాయి. దీనిని నిజం చేస్తూ ఈ సాయంత్రానికి విషయం ఓ కొలిక్కి వచ్చింది.
అంతేకాక కేబినెట్ లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తనయుడు రాహుల్ గాంధీ చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాష్ట్రం నుంచి చిరు కాక మరొకరికి మంత్రి పదవి దక్కవచ్చని కూడా సమాచారం. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకున్న సందర్భంగా ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో చిరంజీవికి పదవి ఖాయమని, ఆయనకు పర్యాటక శాఖ దక్కవచ్చని హస్తినలో వర్గాల సమాచారం. అయితే మిగతా మంత్రి పదవిని తెలంగాణ వారికిస్తారా, సీమాంధ్ర నేతలకిస్తారా అన్న విషయంపై ఇతమిద్దంగా తెలియరాలేదు.
..avnk