19 Jun Wednesday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Oct 23 ,2012 05:09 pm

    Telugu woman killed in U.S for refusing to part with

    అమెరికాలోని చికాగోలో ఆంధ్రప్రదేశ్‌, ప్రకాశం జిల్లా కు చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సత్యవతి అనే 63 ఏళ్ల మహిళను దుండగులు కాల్చి చంపి, ఆమె 9 ఏళ్ల మనవరాలిని ఎత్తుకుపోయినట్లు ఇక్కడికి సమాచారం అందింది. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగినట్లు తెలుస్తోంది. తన మనవరాలిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన దుండగులను అడ్డుకోవడానికి సత్యవతి ప్రయత్నించింది. వారితో తీవ్రంగా పెనుగులాడింది. చివరకు, ఆమెను దుండగులు కాల్చి చంపి మనవరాలిని ఎత్తుకుపోయారు. చికాగోలో ఉంటున్న తన కుమారుడు హరిప్రసాద్ రెడ్డి వద్దకు సత్యవతి ఇటీవలే వెళ్లింది. కుమారుడు, కోడలు కార్యాలయానికి వెళ్లిన సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఘాతుకానికి పాల్పడ్డారు. సత్యవతి ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం కుడుములకుంట్ల గ్రామానికి చెందిన మహిళ. సత్యవతి మరణంతో ఆమె భర్త కొండారెడ్డి కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొని ఉంది. కొండారెడ్డిని పరామర్శించడానికి బంధువులు, స్నేహితులు వస్తున్నారు. చికాగోలోని ఇంటికి వచ్చిన హరిప్రసాద్ రెడ్డి ఘాతుకాన్ని చూసి, పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాపను ఎత్తుకెళ్లిన దుండగులను త్వరలోనే గుర్తిస్తామని చెబుతున్నారు. దుండగులు పాపను ఎందుకు అపహరించారనే విషయం తెలియడం లేదు. దొంగతనం కోసమే వచ్చారా, మరేదైనా కారణం ఉందా అనేది కూడా తెలియడం లేదు. వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers