
దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లో హిజ్‌బుల్ ముజాయిద్దీన్ సంస్థకు చెందిన ముగ్గురు తీవ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కాశ్మీర్‌లో గ్రామ సర్పంచిలపై బెదిరింపులకు పాల్పడ్డారు. తీవ్రవాదుల బెదిరింపులతో కాశ్మీర్‌లో 140 మందికిపైగా తమ పదవులకు రాజీనామా చేశారు. గత నెలలో ఇద్దరు సర్పంచిలు హత్యకు గురైన నేపథ్యంలో తమకు తుపాకీ లైసెన్స్‌లు ఇవ్వాలని సర్పంచ్‌లు కోరినట్లు సమాచారం.
