మత రాజకీయాలపై మీడియాలో వస్తున్న వార్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు వైఎస్ విజయమ్మ తీవ్రంగా ఖండించారు. తాను ఎక్కడా మత ప్రచారం చేయలేదని, తనకు మతప్రచారం చేయాల్సిన అవసరం లేదని ఆమె పులివెందులలో మీడియా సమావేశంలో అన్నారు. తాను ఎక్కడికి వెళ్లిన బైబిల్ ను తీసుకు వెళతానని.... బైబిల్ చేతిలో ఉంటే ధైర్యంగా ఉంటుందన్నారు. అంత మాత్రాన తాను మతప్రచారం చేసిటన్లు కాదన్నారు. తన మతం మానవత్వమని, అన్ని మతాలను గౌరవిస్తానని విజయమ్మ స్పష్టం చేశారు. మనుషులను ప్రేమించటమే వైఎస్ ఆర్ నేర్పించారని ఆమె అన్నారు. తన భర్త చనిపోయిన తర్వాత కొడుకు జైలుకు వెళ్లిన తర్వాత తాను రాజకీయాల్లోకి రావల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి మత రాజకీయాలు చేయవద్దని విజయమ్మ ఈ సందర్బంగా మీడియాకు విజ్ఞప్తి చేశారు.
కాగా, విజయమ్మ ఏ కార్యక్రమానికి వెళ్లిన బైబిల్ ను పట్టుకుని వెళ్లే విషయం విధితమే. విజయమ్మ బైబిల్ పట్టుకెళ్లడంపై గత కొన్ని రోజులుగా కొన్ని రాజకీయ పార్టీలు,ఓ వర్గం మీడియా రాద్దాంతం చేస్తున్నాయి. రాజకీయం ముసుగులో విజయమ్మ మత ప్రచారం చేస్తున్నారనీ సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయమ్మ స్పందించారు. మత రాజకీయాలపై మీడియాలో వస్తున్న వార్తలను కూడా ఆమె ఖండించారు. తానెక్కడా మత ప్రచారం చేయడం లేదనీ, తనకు మత ప్రచారం చేయాల్సిన అవసరం అంతకంటే లేదన్నారు.
...avnk