
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. స్వామివారికి ప్రసాదం తయారు చేసే గదిలో నాలుగు ఖాళీ మద్యం సీసాలు దొరికాయి. వాటి పక్కనే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే వడలు ఉన్నాయి. సత్రం విభాగంలో పనిచేసే సిబ్బంది ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆలయ సిబ్బంది కొంతకాలంగా ఆలయంలోనే మద్యం తాగుతూ అపచారానికి పాల్పడుతున్నారని భక్తులు ఆరోపించారు. ఆలయంలో మద్యం సీసాలు లభించటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆలయ అధికారులను ప్రశ్నిస్తే మాకేం తెలియదంటూ చేతులు దులుపుకున్నారు.
...avnk