జగన్ జైలుకు వెళ్లినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ నుండి, ఇతర పార్టీల నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు తగ్గాయి. కానీ నిన్న షర్మిళ పాదయాత్ర మొదలు పెట్టడంతో మళ్ళీ వలసల కార్యక్రమం మొదలైనట్లుంది. ఇప్పటికే అదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరడానికి సిద్దం అయ్యారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి శాసనసభ్యుడు రాజేష్ .ఎమ్ కూడా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి, వైయస్సార్ సీపీలో చేరడానికి సిద్ధం అయినట్లు సమాచారం. గతంలోనే ఈయన ఈ పార్టీలోకి రావాలని భావించినా, కొన్ని కారణాల వల్ల ఆగిపోయారు.రాజేశ్ ను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడు రాజీనామా ప్రకటన చేయమంటే అప్పుడు ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు. మరి షర్మిళ యాత్ర ముగిసే సరికి ఎందరు వైయస్సార్ సీపీలో చేరుతారో చూడాలి.