
పాతబస్తి పర్యటనలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ షాక్ తగిలింది. పాతబస్తిలో ఆయన పర్యటనను తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ అడ్డుకుంది. జైతెలంగాణ నినాదాలతో ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి న్యాయవాదులను అడ్డుకున్నారు. పోలీసుల జులుంలో పలువురు న్యాయవాదులు తీవ్రంగా గాయపడ్డారు. న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
