ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు, రాంపూర్ నిజయోజక వర్గం ఎంపీ అయిన జయప్రద మన రాష్ట్రంలో జరుగుతున్న పాద యాత్రల పై తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పాదయాత్రలో ఓ సందర్భంలో మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఘాటు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘వస్తున్న మీకోసం ’ అనే పాదయాత్ర చేస్తున్నాడు. త్వరలో బాబు యాత్రకు పోటీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత చెల్లెలు షర్మిలా కూడా పాదయాత్ర చేపట్టబోతున్నారు. పాదయాత్రలు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారాయని ఆమె అభిప్రాయపడ్డారు. పాదయాత్రలతో ఒరిగేదేమిటో ప్రజలే నిర్ణయిస్తారని ఆమె చెప్పారు. పాదయాత్రల వల్ల తమకు ఏమైనా లాభం జరుగుతుందా లేదా అని ప్రజలు నిర్ణయించుకోవాలని ఆమె సూచించారు. మరి జయప్రద ఎవరిని ఉద్దేశించి అన్నదో మాత్రం స్పష్టంగా తెలియదు. మరి ఈమె వ్యాఖ్యల పట్ల టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి.
