పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి , ఫైర్ బ్రాండ్ అయిన మమతా బెనర్జీ హత్యాచారాల పై తన దైనశైలిలో స్పందించారు. దేశంలో ఆడవాళ్ళ పై జరుగుతున్న హత్యాచాల పై ఘాటుగా స్పందించారు. ఆమె పశ్చిమబెంగాల్ లో దేవీ నవరాత్రుల సందర్భంగా ‘జాగోబంగ్లా ’ పత్రిక ప్రత్యే సంచిక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ‘‘ఆడా మగా రాసుకుపూసుకు తిరిగితే అత్యాచారాలు జరగవా?" అని ప్రశ్నించారు. స్త్రీ, పురుషులు హద్దులు చెరిపేసుకుని సన్నిహితంగా మెలగటం వల్లే అత్యాచారాలు జరగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ఆడామగా చేతిలో చెయ్యేసుకుని నడిస్తేనే పెద్దలు మందలించేవారని గుర్తు చేశారు. నేడు బహిరంగంగా ఒకర్నొకరు అతుక్కుపోయి తిరుగుతున్నారని విమర్శించారు. ఆడవాళ్ళు కూడా హద్దులు దాటుతున్నారు కాబట్టే ఇలా జరుతున్నాయని ఆమె ఉద్ధేశ్యం కావచ్చేమో. మొత్తానికి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపుతాయో చూడాలి.
