జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో అరెస్టు అయిన ఐఏఎస్ అధికారి బిపి ఆచార్యకు బెయిల్ మంజూరు అయింది. గతంలో ఎన్నో సార్లు బెయిల్ కోసం ప్రయత్నించిన ఆచార్యకు నిరాశే ఎదురైంది. కానీ ఈ రోజు నాంపల్లి కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల నగదు, రెండు సొంత పూచీకత్తులు ఇవ్వాలని కోర్టు తెలిపింది. అలాగే ఆచార్య ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలని, పాస్పోర్టును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.. మొన్ననే శ్రీలక్ష్మికి కూడా బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
