టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘మీకోసం వస్తున్నా ’ పాదయాత్ర విజయవంతంగా కొన సాగుతుంది. ఈయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు . ఈయన యాత్రకు న్యూజెర్సీలోని ఎన్నారై టీడీపీ, స్థానిక ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో సంఘీభావ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా... కార్ల ర్యాలీ, పాదయాత్రలు నిర్వహించారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర ముఖ్య ఉద్దేశాలను ప్రవాసాంధ్రులకు వివరించారు.
