భారతీయ జనతా పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆ పార్టీకి స్వస్తి చెప్పి సొంత కుంపటి పెట్టుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. తన పార్టీని డిసెంబర్ లో స్థాపించబోతున్నానని ఇది వరకే చెప్పిన యడ్డీ ఇప్పు ఆ పార్టీ పేరు కూడా ఖరారు చేసినట్లు వార్తలు. మనకు తెలిసిన తాజా సమాచారం ప్రకారం తన పార్టీ పేరు ‘కర్టాటక జనతా పార్టీ ’గా నామకరణం చేయబోతున్నట్లు వార్తలు. ఇక ఈ పార్టీకి చెందిన గుర్తు కోసం తన సన్నిహితుల దగ్గర, తనకు తెలిసిన న్యాయవాదులను కూడా సంప్రదిస్తున్నాడని, ఆ పార్టీ గుర్తుగా ‘సైకిల్ ’ ని ఎన్నుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
