కర్నాటకకు చెందిన ప్రముఖ టివి నటి హేమ శ్రీ హత్యా మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈమె అక్టోబర్ తొమ్మిదిన మరణించిన విషయం తెలిసిందే. ఈమె హత్య పై పలు అనుమానాలు రావడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న కాంగ్రెస్ నాయకుడు మురళినీ శనివారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. కేసుపై మురళి మాట్లాడుతూ హత్యతో తనకు ఎలాంటి సంబంధంలేదని, సాక్షిగా మాత్రమే తన పేరు చేర్చినట్లు తెలిపారు. ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. హేమశ్రీ భర్త తనకు స్నేహితుడు కావడంతో లాడ్జిలో ఉండేందుకు అనుమతించానని మురళి పేర్కొన్నారు. చివరగా పోలీసులు హేమా శ్రీ భర్తే హత్యచేసినట్లు తెలిపారు. ఆమెకు క్లోరాఫామ్ అధిక మొత్తంలో ఇచ్చి మత్తులో ఉన్న ఆమెను గొంతునులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది.
