పాకిస్తాన్ సాహస బాలిక మూలాలా ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. రావల్పిండి ఆసుపత్రిలో ఆమెకు ప్రత్యేకమైన వైద్యాన్ని అందిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని పాక్ ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. కాగా మూలాలపై తాలిబన్లు జరిపిన కాల్పులను వ్యతిరేకిస్తూ ఆ దేశ ముస్లిం మతపెద్దలు ఫత్వా జారీ చేశారు. మరోవైపు మలాలా త్వరగా కోలుకోవాలని పాక్ ప్రజలు శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు చేశారు. ఈ కేసులో భాగంగా ముగ్గురు వ్యక్తులను అనుమానితులుగా అరెస్టు చేశారు. ఈ కాల్పులకు సూత్రధారిగా భావిస్తున్న అతవుల్లా అనే తాలిబన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
