23 May Thursday, 2013
Mahatma Gandhi Sukthulu
TW Radio
Panchangam
  • Oct 13 ,2012 01:24 pm

    Congress-MP

    కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉంటే గూండాల్లా వ్యవహరిస్తారనే ప్రచారం ప్రజల్లో ఉంది. గతంలో ఎంతో మంది నాయకులు గుండాగిరి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా గుజరాత్ కి చెందిన పోరుబందర్ ఎంపీ విఠల్ రాడియా తన స్థాయిని మరచిపోయి టోల్ గేట్ సిబ్బంది వద్ద హల్ చేయడమే కాకుండా, గన్ గురిపెట్టి బెదిరించాడు. ఈ సంఘటన అక్టోబర్ 10తేది రాత్రి జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వడదొర సమీపంలోని కర్జాన్ గ్రామం వద్ద ఆపారు. కారు డ్రైవర్ పార్లమెంటు సభ్యుడి జిరాక్స్ ఐడెంటిటీ కార్డును టోల్ గేట్ సిబ్బందికి చూపించాడు. అయితే వారు ఒరిజినల్ కావాలని అడిగారు. దీంతో ఎంపిగారికి ఆగ్రహం వచ్చింది. ఆలస్యం అవుతుందంటూ ఎంపిగారు కారు దిగేసి తన లైసెన్స్‌డ్ గన్ టోల్ గేట్ సిబ్బందికి గురి పెట్టారు. టోల్ గేట్ సిసిటివీ ఎంపిగారు బెదిరించిన వైనాన్ని రికార్డు చేసింది. ఈ వీడియో టేపును మీడియా నిన్న ప్రసారం చేయడంతో విషయం బయటకు వచ్చింది.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers