
రోడ్డు ప్రమాదాలతో పాటు పోటీగా పడవ ప్రమాదాలు కూడా ఎక్కువుగానే జరుగుతున్నాయి. బస్సులో ప్రయాణించి వారు క్షేమంగా గమ్యం చేరుతారు అని చెప్పే రోజులు పోయాయి. అలాగే పడవలో ప్రయాణించి వారు కూడా క్షేమంగా అవతలి ఒడ్డు చేరుతారు అని చెప్పి రోజులు కూడా పోతున్నాయి. ఈ రోజు బీహార్‑లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. బెగుసరాయ్ జిల్లా మధురాపూర్ సమీపంలో గంగానదిలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో 17మంది గల్లంతు కాగా, ఇప్పటివరకూ ఆరు మృతదేహాలు లభ్యం అయ్యాయి. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గజ ఈతగాళ్లు రంగంలోకి గల్లంతు అయినవారి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా పాట్నాలోని చౌక్ పోలీస్ స్టేషన్ కుప్పకూలిన ప్రమాదంలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
