
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళి నుండి ప్రకాశం జిల్లాలో ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.... తాను దివంగత ముఖ్యమంత్రి వైయస్, మాజీ ముఖ్యమంత్రి , ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యలు చేసిన అప్పులు తాను చెల్లిస్తున్నానని అన్నారు. 2008 నుండి కాంగ్రెసు ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంట్స్ ఇస్తున్నప్పటికీ వారు చెల్లించలేదని, ఆ అప్పులు ఇప్పుడు తాను చెల్లిస్తున్నానని ఆయన చెప్పారు. అందులో భాగంగా రూ.8,300 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. అందరికీ విద్య అవసరమని, దానిపై తాను దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలను చూస్తుంటే... తన మాటలలో ఘాటు పెంచినట్లు కనిపిస్తుందని, ఇదంతా తన వ్యతిరేకులను హెచ్చరించడానికే అని అంటున్నారు.
