విద్యావ్యవస్థలో క్రీడలను భాగం చేయాలని మాస్టర్ బ్లాస్టర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒకవేళ ప్రభుత్వం సరియైన నిర్ణయం తీసుకుంటే తన వంతు సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ కు లేఖ రాశారు. క్రీడలపై విద్యాసంస్థలు అశ్రద్ద చూపుతున్నాయని సచిన్ అన్నారు. కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో క్రీడలపై సమగ్ర పరిశీలన చేపట్టి.. ఓ రోడ్ మ్యాప్ ను రూపొందించాలని సిబాల్ కు సచిన్ సూచించారు. సచిన్ ప్రతిపాదనలను సిబాల్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. త్వరలోనే సచిన్ తో సిబాల్ సమావేశమయ్యే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు.
