26 May Sunday, 2013
Vemana Sathakam
TW Radio
Panchangam
E - Articles
  • Controversy erupts over Robert Vadra.png

    Oct 09 ,2012 12:53 pm

    robert-vadraకాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడుంటే అక్కడ తండ్రుల అధికారాన్ని అడ్డపెట్టుకొని కొందరు, మరికొంత మంది కాంగ్రెస్ నేతలు అవినీతి చేసి కోట్లకు పడగలెత్తారు. ఇక నేనేం తక్కువ తిన్నానని అనుకున్నాడో కానీ... అత్త అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఫుల్ గా సంపాదించాడు. ఆయనెవరో కాదు... సాక్షాత్తు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా. ఈయన డీఎల్ఎఫ్ సంస్థ నుండి అక్రమంగా కోట్లు గడించాడని సామాజిక కార్యకర్త కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే.

    ఈ వ్యాఖ్యల పై రాబర్ట్ వాద్రా ఫేస్ బుక్ లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు... బనానా రిపబ్లిక్‌లో మ్యాంగో పీపుల్ అన్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అతను ఫేస్‌బుక్ నుండి తొలగించారు. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల పై కాంగ్రెస్ నేతలు, డీఎల్ఎఫ్ ప్రతినిధులు కూడా ఖండించారు. మరి అత్త చాటు అల్లుడుగారి గిల్లుడు ఎంత వరకు ఉందో తెలియాలంటే  ఇంకా చాలా విషయాలు బయటకు రావాలి.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers