20 Jun Thursday, 2013
Sumathi Sathkam
TW Radio
Panchangam
E - Articles
  • Srilakshmi gets bail after 281 days.png

    Oct 09 ,2012 12:46 pm

    Srilaxmiఓఎంసీ గనుల అక్రమాల కేసులో అరెస్టు అయిన శ్రీలక్ష్మికి 281 రోజుల తరువాత ఎట్టకేలకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీలక్ష్మికి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. గత కొన్ని రోజుల నుండి బెయిల్ ఎప్పుడొస్తుందా అని నిరీక్షిస్తున్న శ్రీలక్ష్మి దసరా పండగకి ముందు బెయిల్  రావడం ఒకింత సంతోషకరమే. గతంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిసారి తిరస్కరణకు గురయ్యింది.

    కానీ ఈసారీ అనారోగ్యం సమస్యలను న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లిన ఆమె, ఆపరేషన్ లేదా ఇతర వైద్య వి«ధానాల (రోబోటిక్ సర్జరీ) ద్వారా చికిత్స తీసుకోవాలని.. అందుకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈసారి ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న సీబీఐ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్టు తమకి అప్పజెప్పాలని, హైదరాబాద్ ని విడిచి ఎక్కడికి వెళ్లరాదని షరతులు విధించింది. వచ్చే ఏడాది జనవరి 21వ తేదీన మళ్లీ కోర్టులో లొంగిపోవాలని సూచింది. ఇక నిన్న పొద్దుపోయిన తరువాత తీర్పు వెలువడంతో శ్రీలక్ష్మి ఇవాళ ఉదయం జైలు నుండి విడుదలయి పోయారు.

Facebook Comments

Telugu News | Cinema | Gallery | Telugu Forums | Flash News | Movie Gossips | Movie Reviews | Telugu Interviews | Hyderabad News | Vijayawada News

Hyderabad Rave Party | Telugu Journalism | ED Officials At Chanchalguda | Jagan Case | VH meets Chiru | Fire Breaks Sufi Shrine | War Between Newspapers