నలుపు, తెలుపు గీతల్లో ఆ ఉత్పత్తికి సంబంధించిన సమస్త సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునే బార్‌కోడ్‌కు ఆదివారంతో 60 ఏళ్లొచ్చేశాయి. 1952, అక్టోబర్ 7న తొలిసారిగా అమెరికాలో బార్‌కోడ్ తయారైంది. అయితే, అది జనజీవన స్రవంతిలోకి వచ్చేసరికి 22 ఏళ్లు పట్టేసింది. ఎందుకంటే.. బార్‌కోడ్‌ను తయారుచేసినా.. దాన్ని చదివే లేజర్ టెక్నాలజీ అప్పటికి లేకపోవడంతో అన్నాళ్లూ బార్‌కోడ్ అజ్ఞాతంలోనే ఉండి పోయింది. 1974లో అమెరికాలోని ఒహియో సూపర్ మార్కెట్లో తొలిసారిగా ఓ చ్యూయింగ్ గమ్ ప్యాకెట్‌ను బార్‌కోడ్ ద్వారా స్కాన్ చేశారు. తొలిదశలో కొన్ని వైన్ కంపెనీలు తమ బాటిళ్ల అందం చెడిపోతుందనే కారణంతో లేబుళ్లపై బార్‌కోడ్‌ను ముద్రించడానికి నిరాకరించేవట. అలాంటిది ఇప్పుడా బార్‌కోడ్‌ను పచ్చబొట్ల కింద వేయించుకునే దాకా వచ్చింది. ఇలా బార్‌కోడ్‌ను టాటూగా వేయించుకున్న వారిలో అమెరికాకు చెందిన ప్రముఖ గాయని పింక్ ఉన్నారు.