రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. మొన్నటి వరకు నారా చంద్రబాబుకి, నందమూరి హరిక్రిష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల ఫామిలీల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయని, అందుకే నారా కుటుంబం నందమూరి కుటుంబానికి
దూరం ఉంటుందని, గత కొద్దికాలం వరకూ పార్టీ నాయకత్వం వ్యవహార శైలి, అధినేత నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తితో ఉండి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఎంపీ నందమూరి హరికృష్ణ, రాజీకి వచ్చి ఈ రెండు కుటుంబాలు దగ్గరయినట్లు కనిపిస్తున్నాయి. తన బావ చంద్రబాబునాయుడు పాదయాత్ర ప్రారంభించిన రోజున ఆయన పక్కన ఉండి అన్నీ తానై వ్యవహరించారు. రెండురోజులు ముందుగానే హిందూపురానికి వెళ్లి పాదయాత్ర ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించారు. ఇప్పుడు ఈ పాద యాత్రకు జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరు కాబోతున్నాడని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పాదయాత్రలో పాల్గొంటే జనస్పంద న ఇంకా పెరుగుతుందని అంతే కాకుండా సినీ గ్లామర్ కూడా తోడవుతుందని టీడీపీ నేతలు అంటున్నారు.
